BLIND FOLD WALK 2018 AT VINJAMUR, SPSR NELLORE, AP

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వింజమూరు మండలంలో నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా “సక్షమ్ – కాంబా” ఆధ్వర్యంలో “Blind Fold Walk” అనే కార్యక్రమం నిర్వహించటం జరిగింది. జిల్లా సంఘటనా కార్యదర్శి వెన్నపూస శ్రీనివాసులు రెడ్డి పర్యవేక్షణలో సక్షమ్ వింజమూరు, కొండాపురం, దుత్తలూరు మండల కన్వీనర్లు PV కృష్ణారెడ్డి, V.పరబ్రహ్మయ్య, Sవెంగళరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విశ్రాoత జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాసిలామణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమం దాదాపు కిలోమీటరు పైగా సాగింది. కార్యక్రమ ముగింపులో మోడరన్ హాస్పిటల్ ఇంచార్జి సురేష్ కుమార్ గారితో ఉపన్యాసం ఇప్పించటం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వాధికారులు MRO, MEO, MPDO, అన్నీ పార్టీల నుండి రాజకీయ ప్రముఖులు, కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్వయంసేవకులు, స్వచ్చంథ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యంగా పోలీస్ డిపార్టుమెంటు వారు (6 Members) బాగా సహకరించారు. కార్యక్రమం ఆరంభం నుంచి చివరి వరకు ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తూ కార్యక్రమం ముగింపోన్యాసంలో దాదాపు 45 నిముషములకు పైగా ట్రఫిక్ ను పూర్తిగా నిలిపి వేసి ఎటువంటి వాహనాలను కదలనీయకుండా చేసి కార్యక్రమ విజయవంతంలో ప్రముఖ పాత్ర పోషించారు. కార్యక్రమంలో దాదాపు 450 మంది పాల్గొనగా 180 మంది విద్యార్థినులు, 220 మంది విద్యార్థులు, మిగిలిన వారు 50 మంది పాల్గొన్నారు.