సక్షమ్ నేత్రదాన వారోత్సవాలు (19.02.2019- 27.02.2019)

గురూజీ కి ఘన నివాళి – సక్షమ్ నేత్రదాన వారోత్సవాలు (24.02.2019) ఆదివారం నాడు నెల్లూరు లో స్థానిక కస్తూరిదేవి గార్డెన్స్ లో తీర ప్రాంత గ్రామ స్వయం సేవకుల సమ్మేళనం నిర్వహించగా ఇదే కార్యక్రమానికి అనుబంధంగా సక్షమ్ (సమదృష్టి , క్షమతా వికాసం మరియు అనుసంధాన మండలి) దివ్యాoగుల పని చేస్తున్న అఖిల భారత సంస్థ నెల్లూరు జిల్లా టీం, సక్షమ్ జిల్లా సహ కార్యదర్శి శ్రీ వెన్నపూస శ్రీనివాసులు రెడ్డి గారి ఆద్వర్యంలో నేత్రదాన వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సక్షమ్ అఖిల భారత సంఘటనా కార్యదర్శి మాననీయ శ్రీ సుకుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరై సక్షమ్ దేశ వ్యాప్తంగా దివ్యాంగుల అభివృద్ది కోసం చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి, నేత్రదానం ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో నేత్రదానం చేసిన వారిలో నెల్లూరు విభాగ్ సహ సంఘచాలక్ శ్రీ రామదండు గారు, జయ భారత్ హాస్పిటల్స్ మేనేజర్ శ్రీ గురు ప్రసాద్ గారు, బిజెపి నెల్లూరు ప్రధాన కార్యదర్శి శ్రీ వంశీధర్ రెడ్డి గారు మరి కొంత మంది ప్రముఖులు ఉన్నారు. కార్యక్రమం మొత్తం మీద దాదాపు 180 మంది స్వయంసేవకులు తమ మరణానంతరం నేత్రదానం చేయటానికి ముందుకు వచ్చి ప్రతిజ్ఞా పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో సక్షమ్ సభ్యులు దోర్నాదుల వెంకటేశ్వర్లు , వడ్డే పరబ్రహ్మయ్య, వెంకటరమణయ్య, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. సక్షమ్ భారత్ సమర్థ భారత్.