Saksham Divyang District Convention at Nellore

విజయవంతంగా జరిగిన సక్షమ్ నెల్లూరు జిల్లా దివ్యాంగుల మహాసభ 14 డిసెంబరు 2019, శనివారము టౌన్ హాలు, నెల్లూరు.
దివ్యాంగుల సంక్షేమము మరియు అభివృద్ది కోసము సమాజములో ప్రతి ఒక్కరినీ కలుపుకుని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే చిట్ట చివరి దివ్యాంగ బంధువు కూడా ఆత్మగౌరవంతో జీవించే విధంగా చేయటమే సక్షమ్ ముఖ్య ఉద్దేశ్యమని సక్షమ్ అఖిల భారత సంఘటనా కార్యదర్శి మాననీయ డాక్టర్ సుకుమార్ తెలిపారు. 14 డిసెంబరు 2019 శనివారం నాడు నెల్లూరు పురమందిరం నందు నిర్వహించిన సక్షమ్ జిల్లా మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని  జిల్లా కార్యదర్శి కిరణ్ మయూర్ మరియు శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు తులసి మొక్కతో అతిధులందరినీ వేదిక వద్దకు ఆహ్వానించగా, జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతి ప్రార్ధనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేదిక పైన RSS నెల్లూరు విభాగ్ సంఘచాలక్ శ్రీ నాగారెడ్డి హరికుమార్ రెడ్డి గారు, సక్షమ్ ఆర్థోపెడిక్ రాష్ట్ర కన్వీనర్ మరియు దివ్యాంగుల జాతీయ నిధి పర్యవేక్షక కమిటీ సభ్యులు శ్రీ వెన్నపూస శ్రీనివాసులు రెడ్డి గారు, రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీ ఏవీఎస్ సుబ్రహ్మణ్యం గారు, సక్షమ్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ సురేష్ కుమార్ గారు, శ్రీ రాజేశ్వరి దేవి గారు, దాక్టర్ సురేష్ బాబు గారు, జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ లక్ష్మీ నారాయణ గారు ఉన్నారు. శ్రీ సురేష్ కుమార్ గారు కార్యక్రమం ఏర్పాటు చేయటానికి గల ముఖ్య ఉద్దేశ్యాన్ని వివరించగా శ్రీ శ్రీనివాసులు రెడ్డి గారు సక్షమ్ సంస్థ యొక్క ఆవిర్భావం, పని చేయు విధానo మరియు సక్షమ్ ఇతర సంస్థల కన్నా ఎందుకు ప్రత్యేకమైనదో వివరించారు. డాక్టరు సురేష్ గారు చిన్నతనంలోనే  వైకల్యం భారీన పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ పథకాలు, వివిధ సమస్యలపైనా చర్చించి సూచనలు తీసుకున్నారు. ఇందులో డాక్టర్లు,  ప్రత్యేక ఉపాద్యాయులు, ఫిజియోతెరపిస్టులు, వివిద రకాల స్వచ్చంద సంస్ధలు వాటి ప్రతినిధులు, పత్రికా విలేకరులు ఎందరో సమాజ సేవకులు పాల్గొన్నారు. కార్యక్రమ ముగింపులో వైకల్యంతో బాధపడుతూ ఉత్తమ ప్రతిభ కనబరచిన వారిని సత్కరించి జాతీయ గీతంతో ముగించారు. కార్యక్రమం అంతటినీ జిల్లా సక్షమ్ సహ కార్యదర్శి శ్రీ దోర్నాదుల వెంకటేశ్వర్లు గారు మరియు జిల్లా కార్యవర్గము పర్యవేక్షిస్తూ పలువురు ప్రభంధకులతో  వచ్చిన దివ్యాంగ బంధువులందరికీ ఎటువంటి ఇబ్బందీ లేకుండా జాగ్రత్తగా ఏర్పాట్లు చేశారు. 
సక్షమ్ భారత్ సమర్ధ భారత్…