Saksham Foundation Day Celebrations, Spsr Nellore.
ఈ రోజు (30.06.2018) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, నెల్లూరు నగరములో దర్గామిట్ట ఏరియాలో ప్రభుత్వ సర్వజన వైద్యశాల సమీపమునందు గల విశ్వభారతి అంధుల పాఠశాల ఆవరణలో సక్షమ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు (పదవ వార్షికోత్సవ వేడుకలు) ఘనంగా నిర్వహించాము. ఈ కార్యక్రమములో సక్షమ్ రాష్ట్ర కార్యవర్గసభ్యులు డాక్టర్ సురేష్ బాబు గారు, సక్షమ్ నెల్లూరు జిల్లా కార్యదర్శి ఇమ్మడిశెట్టి సురేష్ కుమార్ గారు , సహ కార్యదర్సులు కిరణ్ మయూర్ గారు , దోర్నాదుల వెంకటేశ్వర్లు గారు , జీజీహెచ్ డాక్టర్ వసంత్ గారు , వై మల్లికార్జున రెడ్డి , ఐ మల్లికార్జున రెడ్డి , కొండేటి శివారెడ్డి గారు , చందూ గారు పాల్గొన్నారు . అందరి సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశాము . కార్యక్రమ అనంతరం పిల్లలందరికీ రోజు వారీ వాళ్ళ దినచర్యలకు అవసరమగు నిత్యావసర వస్తువులు , విద్యా సామగ్రి పంపిణీ చేశాము . అంతే కాకుండా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు జరిపే విధంగా చర్చించటం జరిగింది .
మీ
వెన్నపూస శ్రీనివాసులు రెడ్డి సక్షమ్ .