Saksham – Praanadaa Blood Donation Camp, Kondaluram Mandal, Spsr Nellore
ఈ రోజు (10.07.2018) మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కొండాపురం మండలం, గరిమెనపెంట పంచాయతీ , కోవివారిపల్లి గ్రామంలోని ప్రభత్వ ప్రాథమిక పాఠశాలలో “సక్షమ్-ప్రాణదా” రక్త శిబిరాన్ని సక్షమ్ కొండపురం మండల సంయోజక్ వడ్డే పరబ్రహ్మయ్య ఆధ్వర్యాన నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా వ్యవహరించిన వెన్నపూస శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ సక్షమ్ యొక్క ఆవిర్భావం , చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలియజేసి “ప్రాణదా” ఆవిర్భవించటానికి గల ముఖ్య ఉద్దేశ్యమును వివరించారు . తలసేమియా , సికెల్ సెల్ అనీమియా , హీమోఫీలియా బాధితుల కోసం సంస్థ చేస్తున్న కృషిని మరియు రక్తదానం చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించి ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా భావించి రక్త దానమును ప్రోత్సహించి తలసీమియా బాధిత చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో మండల విద్యా శాఖాధికారి కే.రవికుమార్ గారు , సర్పంచ్ కొండమ్మ గారు, జడ్పీటిసీ శ్రీనివాసులు గారు , ప్రధానోపాధ్యాయులు నాగశంకర్ గారు , కావలి రెడ్ క్రాస్ తరపున రాజశేఖర్ గారి బృందం పాల్గొన్నారు . అందరి సహకారంతో నెల్లూరు జిల్లాలో సక్షమ్ తరపున మొదటి స్వచ్చంథ రక్తదాన శిబిరాన్ని నిర్వహించి విజయవంతం చేయగలిగాము .
ధన్యవాదములతో
మీ
వెన్నపూస శ్రీనివాసులు రెడ్డి సక్షమ్.