Saksham Sthapanaa Diwaas Vinjamur

ఈ రోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరులో సాయంకాలం 4 గంటలకు YR జూనియర్ కళాశాలలో సక్షమ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపాము . ముఖ్య అతిధులుగా రాష్ట్ర అద్యక్షులు డాక్టర్ శ్రీమన్నారాయణ గారు , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సురేష్ బాబు గారు , అస్సాం నుంచి ప్రొఫెసర్ గంగా భూషణ్ గారు , స్ధానిక నేతలు నలుగురు పాల్గొన్నారు . అంతే కాకుండగా సక్షమ్ జిల్లా ఉపాధ్యక్షులు మాధవరెడ్డి కూరపాటి గారు , జిల్లా కార్యవర్గ సభ్యులు తిరుపతి స్వామి గారిని ఆహ్వానించాము . అందరి సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశాము . ఇందులో దాదాపు 110 మంది వరకు దివ్యాoగ బంధువులు పాల్గొన్నారు .
శ్రీమన్నారాయణ గారు మరియు గంగా భూషణ్ గారు సతీ సమేతంగా విచ్చేశారు , వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతృప్తిగా పంపించగలిగాను , అందుకు చాలా సంతోషంగా ఉంది .

మీ
వెన్నపూస శ్రీనివాసులు రెడ్డి సక్షమ్ .