Shri Madhavrao Sadashivrao Golwalkar Guru JI Centenary Celebrations at Vinjamur

సక్షమ్ ఆధ్వర్యంలో గురూజీ జయంతి వేడుకలు
వింజమూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
జిల్లా.

ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పరమ పూజనీయ శ్రీ మాధవరావు సదాశివరావు గోల్వాల్కర్ (గురూజీ) గారిని స్మరించుకుంటూ సక్షమ్ అఖిల భారత స్థాయిలో నేత్రదాన వారోత్సవాలను నిర్వహిస్తుంది. ఈ రోజు సక్షమ్ వింజమూరు, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వారి ఆధ్వర్యంలో శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాలలో గురూజీ జయంతిని ఘనంగా నిర్వహించి నేత్రదాన వారోత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా సక్షమ్ నెల్లూరు జిల్లా సహ కార్యదర్శి మరియు కేంద్ర సామాజిక, న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ జాతీయ నిధి పర్యవేక్షక కమిటీ సభ్యులు శ్రీ వెన్నపూస శ్రీనివాసులు రెడ్డి గారు, ముఖ్య అతిథులుగా వింజమూరు ఖండ కార్యవాహ శ్రీ వీరంరెడ్డి నాగేశ్వర్ రెడ్డి గారు, సక్షమ్ వింజమూరు కన్వీనర్ శ్రీ పివి క్రిష్ణారెడ్డి గారు పాల్గొన్నారు. ఈ జయంతి వేడుకలలో మొత్తం 95 మంది పాల్గొనగా అందులో సక్షమ్ కొండాపురం మండల కన్వీనర్ వడ్డె పరబ్రహ్మయ్య , కలిగిరి ఖండ శారీరక ప్రముఖ్ శ్రీ చల్లా గోపి గారు, వింజమూరు నగర కార్యవాహ చలమయ్య గారు, జాగృతి జిల్లా ప్రచార ప్రముఖ నర్రావుల పుల్లారెడ్డి, SSF జిల్లా కన్వీనర్ గుణ్ణం మాధవ రెడ్డి గారు, బిజెపి నాయకులు చుండి హరిగోపాల్ రెడ్డి గారు, మద్దూరి నాగేశ్వర రెడ్డి గారు, మూలే బాలకృష్ణా రెడ్డి గారు, ABVP వింజమూరు కన్వీనర్ అకిలి రవికిరణ్, కళాశాల యాజమాన్యం, కొంత మంది పురప్రజలు పాల్గొన్నారు.